ట్రెండింగ్
Epaper    English    தமிழ்

స్వాతి మలివాల్‌ దాడి కేసులో కీలక పరిణామం

national |  Suryaa Desk  | Published : Sun, May 19, 2024, 11:32 AM

ఆప్ రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్‌ దాడి కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. మలివాల్‌పై దాడి జరిగిన రోజు సీఎం నివాసంలో సీసీ ఫుటేజ్ ట్యాంపర్ చేశారని ఢిల్లీ పోలీసులు వెల్లడించడం సంచలనం రేపుతోంది.కేజ్రీవాల్ నివాసంలో స్వాధీనం చేసుకున్న సీసీటీవీ పుటేజ్ బ్లాంక్‌గా ఉందని, వీడియోను తొలగించారని పోలీసులు పేర్కొన్నారు. సీసీటీవీ పుటేజ్‌కు సంబంధించిన డిజిటల్ వీడియో రికార్డర్‌ను ఇచ్చేందుకు కేజ్రీవాల్ నిరాకరిస్తున్నారని చెబుతున్నారు.మరోవైపు నిన్న ఈ కేసులో సీఎం కేజ్రీవాల్‌ పీఏ బిభవ్‌ను అరెస్ట్ చేసిన ఢిల్లీ పోలీసులు.. ఆయన విచారణకు సహకరించడం లేదని వెల్లడించారు. బిభవ్‌ తన ఫోన్‌ పాస్‌వర్డ్‌ కూడా తమకు ఇవ్వడం లేదని పోలీసులు ఆరోపిస్తున్నారు.


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com