నెల్లూరు జిల్లా, బుచ్చి మండలం, దామర మడుగు వద్ద ముంబాయి హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నెల్లూరు వైపు వెళ్తున్న లారీని ఆర్టీసీ బస్సు ఢీ కొంది. కనిగిరి నుంచి నెల్లూరుకు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా పలువురికి గాయాలయ్యాయి. అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా బస్సులో 47 మంది ప్రయాణీకులు ఉన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa