పల్నాడు జిల్లా ఎస్పీగా మాలికా గార్గ్, అనంతపురం ఎస్పీగా గౌతమి శాలి, తిరుపతి ఎస్పీగా హర్షవర్ధన్ రాజును ఈసీ నియమించింది. శనివారం సాయంత్రం 7గంటల్లోగా బాధ్యతలు స్వీకరించాలని ఆదేశించింది. ఇతర రాష్ట్రాల్లో ఎన్నికల పరిశీలకులుగా వెళ్లినవారికి ఆదివారం సాయంత్రం వరకూ సమయం ఇచ్చింది. మాలికా గార్గ్, హర్షవర్ధన్ రాజు ఇతర రాష్ట్రాలకు ఎన్నికలపరిశీలకులుగా వెళ్లారు. కాగా రాష్ట్ర ప్రభుత్వం ఐదుగురు ఐపీఎస్ అధికారుల పేర్లను పంపిన సంగతి తెలిసిందే. అయితే తమ ఆదేశాల మేరకు 9మంది పేర్లను పంపాల్సిందేనని ఈసీ స్పష్టం చేసింది. ‘మా దగ్గర ఐపీఎ్‌సలు సరిపడా లేరు.. ఎస్పీ ర్యాంకుల్లో కొరత ఉంది.. ఐదుగురిలో నుంచి ముగ్గురిని ఎంపిక చేసుకోండి అంటే కుదరదు. రూల్ పాటించాల్సిందే. ప్రతిజిల్లాకు మూడుపేర్ల చొప్పున మొత్తం తొమ్మిది మంది జాబితా పంపాల్సిందే’ అని రాష్ట్ర ప్రభుత్వానికి ఈసీ స్పష్టమైన ఆదేశాలిచ్చింది. చేసేదిలేక ఈసీ చెప్పినట్లే మరో నాలుగు పేర్లు చేర్చి సీఎస్ జవహర్‌రెడ్డి జాబితా పంపారు. పల్నాడు జిల్లాకు మాలికా గార్గ్, అధిరాజ్ సింగ్ రాణా, కె. శ్రీనివాసరావు... అనంతపురం జిల్లాకు గౌతమి శాలి, నచికేత్ విశ్వనాథ్, నరసింహ కిశోర్... తిరుపతి జిల్లాకు సునీక్ శరాక్, రాహుల్ మీనా, హర్షవర్ధన్ రాజు పేర్లను ఢిల్లీకి పంపారు. ఈసీ వీరిలో నుంచి ముగ్గురిని ఎంపిక చేసింది.