ఎయిర్ పోర్ట్‌లో అన్యాయంగా ఎన్ఆర్ఐ వైద్యుడు లోకేష్‌ను అరెస్టు చేశారని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత దేవినేని ఉమ అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలపై లోకేష్ అభిప్రాయాలు వ్యక్తం చేయడం తప్పా అని ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డి అవినీతిపై లోకేష్ తన అభిప్రాయాలు చెప్పారని అన్నారు. సోషల్ మీడియాలో జగన్ అవినీతిపై పోస్ట్‌లు పెట్టి ప్రశ్నించారని చెప్పారు. 20 మంది పోలీసులతో కొట్టి మరీ హింసలు పెట్టారని ధ్వజమెత్తారు.తీవ్రమైన దెబ్బలతో ఉన్నా లోకేష్‌ను ఆస్పత్రికి తరలించకుండా వ్యానులో తిప్పారని మండిపడ్డారు. జగన్ ప్రభుత్వంలో పోలీసుల దుర్మార్గాలకు ఇదొక పరాకాష్ట చర్య అని అభివర్ణించారు. సీఎం సెక్యూరిటీ లోకేష్‌ను గుర్తించి పోలీసులకు అప్పగించారని చెప్పారు.లండన్ వెళ్తూ జగన్.. తన రాక్షసత్వాన్ని నిరూపించారన్నారు. దీనివెనుక. ఎవరు ఉన్నారు, ఎవరు చేశారో విచారణ చేయాలని డిమాండ్ చేశారు.