కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్(క్యాట్) తీర్పును అనుసరించి తనకు పోస్టింగ్ ఇప్పించాలంటూ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు శనివారం లేఖ రాశారు. ఈ నెల 31న పదవీ విరమణ చేయనున్న తనకు పోస్టింగ్ ఇవ్వడంలో జాప్యం జరుగుతోందని, న్యాయం చేయాలని కోరారు. రాష్ట్రంలోనే అందరికన్నా సీనియర్ ఐపీఎస్ అయిన తన సస్పెన్షన్ చెల్లదంటూ పది రోజుల క్రితమే క్యాట్ తీర్పు ఇచ్చిందంటూ లేఖతోపాటు ఆ కాపీని జత చేశా రు. ఈ లేఖను సీఈవో కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారికి పంపించారు. సీఈసీ నిర్ణయం మేరకు ఏబీవీకి పోస్టింగ్ లభించే అవకాశం ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa