శ్రీశైలం మహాక్షేత్రానికి ఆదివారం భక్తులు భారీగా తరలి వచ్చారు. తెలుగు రాష్ట్రాల నుంచి వేల సంఖ్యలో తరలి రావడంతో ఆలయ ప్రధాన వీధులన్నీ రద్దీగా మారాయి. క్షేత్ర పరిధిలోని సత్ర సముదాయాలు కిక్కిరిసి కనిపించాయి. భ్రమరాంబ మల్లికార్జున స్వామి, అమ్మవార్లను దర్శించుకునేందుకు ఆదివారం ఉదయం నుం చే భక్తులు బారులు దీరారు. కల్యాణ కట్టలో స్వామివారికి తలనీలాలు సమర్పించి పాతాళగంగలో పుణ్య స్నానాలు ఆచరించారు. అనంతరం భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. స్వామి, అమ్మవార్ల దర్శనార్థం క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులకు అధికారులు అల్పాహారం, తాగునీరు అందజేశారు. దేవస్థానం అధికారులు ఎప్పటికప్పుడు దర్శనం, ఆర్జిత సేవ క్యూలైన్లు, ఆలయ ప్రాంగణాన్ని పరిశీలిస్తూ భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పర్యవేక్షించారు.