కృష్ణాజిల్లా మచిలీపట్నంలో కౌంటర్ కార్యాలయం నందు జిల్లా కలెక్టర్ బాలాజీ జిల్లా అధికారులతో వర్చువల్ సమావేశంలో పాల్గొన్నారు. జూన్ నెలలో ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలకు సిద్ధంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థులకు అవసరమైన మౌలిక సదుపాయాలను పరీక్ష కేంద్రాల వద్ద ఏర్పాటు చేయాలని తెలియజేశారు. గ్రామీణ ప్రాంతాలనుండి విద్యార్థులు వచ్చేందుకు వీలుగా ఆర్టీసీ ప్రత్యేక బస్సు సర్వీసులను ఏర్పాటు చేయాలి.