కారంపూడి మండలం పేటసన్నిగండ్లలో సీఐ నారాయణస్వామి ఆధ్వర్యంలో పోలీసులు ఆదివారం కార్డెన్ సెర్చ్ జరిగింది. మండలంలోని ప్రతి గామాన్ని తనిఖీ చేస్తున్నామని, రికార్డులులేని రెండు బైకులను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ తెలిపారు. వైసీపీకి చెందిన ఇద్దరు, టీడీపీకి చెందిన ఒకరిని పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి వేర్వేరుగా విచారించి పంపారు. రెంటచింతలకు కేంద్ర బలగాలను రప్పించారు. ఇప్పటికే 151 మంది పోలీసులు, ఒక స్ర్టైకింగ్ ఫోర్స్ బలగాలు ఉన్నాయి. ఎన్నికల ఫలితాల వెల్లడి గడువు సమీపిస్తున్న తరుణంలో ఒక కంపెనీ కేంద్ర బలగాలైన సీఐఎస్‌ఎఫ్ ఆదివారం రాత్రి రెంటచింతలకు చేరుకుంది. రాజుపాలెం మండలం నెమలిపురి గ్రామంలో ఎస్‌ఐ షామీర్‌బాషా, సిబ్బంది కార్డెన్‌సెర్చ్ నిర్వహించారు. గ్రామంలోని ప్రతి ఇంటిని తనిఖీ చేశారు. ఎవరైనా గొడవలకు, దాడులకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్‌ఐ తెలిపారు. దుర్గి మండలం మించాలపాడులో ఆదివారం సుమారు 45 మంది పోలీసు బృందంతో డీఎస్పీ రామకృష్ణాచారి, ఇద్దరు సీఐలు, ఇద్దరు ఎస్‌ఐలు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. రికార్డు లేని 11 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్‌ఐ కోటయ్య తెలిపారు.బొల్లాపల్లి మండలం పేరూరుపాడు గ్రామంలో బందోబస్తు కొనసాగిస్తున్నారు. ఆదివారం రూరల్ సీఐ సుధాకర్, ఎస్‌ఐ చెన్నకేశవులు, ఈపూరు ఎస్‌ఐ ఫిరోజ్‌ల ఆధ్వర్యంలో గ్రామంలో కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. గ్రామంలోని ప్రతి ఇంటిని జల్లెడ పట్టారు. అలానే బెల్లంకొండ మండలం నాగిరెడ్డిపాలెంలో ఆదివారం తెల్లవారుజామున రూరల్ సీఐ మంగారావు, ఎస్‌ఐ రాజేష్ పర్యవేక్షణలో 40 మంది పోలీసులు కార్డెన్ సెర్చ్ కార్యక్రమం నిర్వహించారు.