షుగర్ ఆధారిత అన్ని రకాల కూల్‌డ్రింక్స్‌ను స్కూళ్ల పరిసరాల్లో అనుమతించకూడదని డబ్ల్యూహెచ్ఓ మార్గదర్శకాలు విడుదల చేసింది. ఇలాంటి డ్రింక్స్, పీచు మిఠాయిలు, ఐస్‌క్రీముల వల్ల పిల్లల్లో ఊబకాయం, దంతాల సమస్యలు తలెత్తుతున్నాయని పేర్కొంది. దీన్ని నివారించడానికి పాఠశాలల ప్రిన్సిపల్స్ చర్యలు తీసుకోవాలని సూచించింది. కూల్‌డ్రింక్స్‌కు బదులుగా మంచి నీరు, మజ్జిగ, పుదీన, నిమ్మరసాలు అందుబాటులో ఉంచాలని కోరింది.