తీవ్రమైన కడుపు నొప్పి బాధపడుతున్న మహిళకు వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులే షాక్ అయ్యారు. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 570 రాళ్లను ఆమె గాల్ బ్లాడర్‌లో కనిపెట్టారు వైద్యులు. శస్త్ర చికిత్స చేసి ఆ రాళ్లన్నింటినీ బయటకు తీశారు వైద్యులు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల ఇలా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురానికి చెందిన ఓ మహిళకు తీవ్రమైన కడుపు నొప్పి వచ్చింది. వెంటనే అలర్ట్ అయిన ఆమె కుటుంబ సభ్యులు అమలాపురంలోని ఏఎస్ఏ ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు ఆమెకు కొన్ని పరీక్షలు నిర్వహించారు. ఆ స్కానింగ్‌లో షాకింగ్ రిజల్ట్స్ వచ్చయి. గాల్ బ్లాడర్‌లో భారీ సంఖ్యలో రాళ్లు ఉన్నట్లు గుర్తించారు వైద్యులు. వెంటనే ఆమెకు సర్జరీ చేశారు వైద్యులు. బ్లాడర్‌లో ఉన్న 570 రాళ్లను తొలగించారు. ప్రస్తుతం మహిళ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని.. త్వరలోనే కోలుకుంటుందని వైద్యులు తెలిపారు. కాగా, ఇంత పెద్ద సంఖ్యలో బ్లాడర్ నుంచి రాళ్లు తొలగించడం ఇదే మొదటి సారి అయిన వైద్యులు చెబుతున్నారు.