అనంతపురం జిల్లాలోని 29 మండలాల్లో సబ్సిడీ వేరుశనగ కోసం సంబంధిత రైతు భరోసా కేంద్రాల్లో 10, 205 మంది రైతులు రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు జిల్లా వ్యవసాయ అధికారిణి ఉమామహేశ్వరమ్మ మంగళవారం పేర్కొన్నారు. విత్తన కాయల కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్న రైతులకు 9, 077 క్వింటాళ్ల వేరుశనగ అవసరమవుతుందని తెలిపారు. ఈ మేరకు రైతులకు సబ్సిడీపై వేరుశనగలు పంపిణీ చేయాలని ఆదేశించారు.