అనంతపురం జిల్లాలో ఓట్ల లెక్కింపునకు మంగళవారం అధికారులు సర్వం సిద్ధం చేస్తున్నారు. పార్లమెంటుకు 483మంది సిబ్బంది, 8 అసెంబ్లీ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపునకు 578 మంది మొత్తం 1, 061 మంది అవసరం ఉంటుందని ప్రాథమిక అంచనాలు సిద్ధం చేశారు. పరిస్థితిని బట్టి ఈ సంఖ్య మరికొంత పెరగవచ్చని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఓట్ల లెక్కింపు రోజు ఉదయం ర్యాండమైజేషన్ అనంతరం సిబ్బందికి నియోజకవర్గాలు కేటాయిస్తారు.