కేంద్ర ఎన్నికల సంఘం ఆంధ్రప్రదేశ్‌లోని పలు సబ్ డివిజన్లకు కొత్త డీఎస్పీలను నియమించింది. పల్నాడు జిల్లాలోని నరసరావుపేట, గురజాల.. తిరుపతి, చంద్రగిరి, అనంతపురం జిల్లా తాడిపత్రి సబ్‌డివిజన్లకు కొత్త డీఎస్పీలను నియమించారు. వీరితో పాటు మరికొన్ని స్థానాల్లోనూ నియామకాలు జరిపారు. పోలింగ్ రోజున, ఆ తర్వాత చెలరేగిన ఘర్షణలకు బాధ్యుల్ని చేస్తూ మొత్తం 12 మంది డీఎస్పీలు, ఇన్‌స్పెక్టర్లు, ఎస్సైలను ఎన్నికల సంఘం సస్పెండ్ చేశారు. వీరందరి స్థానంలో కొత్త అధికారులను నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు.. వీరు వెంటనే బాధ్యతలు చేపట్టాలని ఎన్నికల సంఘం ఆదేశించింది.
పల్నాడు జిల్లా దిశలో పనిచేస్తున్న ఎం సుధాకర్‌బాబును నరసరావుపేట ఎస్‌డీపీవోగా నియమించారు. కాకినాడ ఎస్సీ, ఎస్టీ సెల్‌లో పనిచేస్తున్న సీహెచ్ శ్రీనివాసరావును గురజాల ఎస్‌డీపీవోగా నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఏసీబీ డీఎస్పీగా ఉన్న కే రవిమనోహరాచారిని తిరుపతి ఎస్‌డీపీవోగా.. ఏలూరు సెబ్‌లో డీఎస్పీగా ఉన్న జనార్థన్ నాయుడును తాడిపత్రి ఎస్‌డీపీవోగా నియమించారు. ఏసీబీ డీఎస్పీ ఎం వెంకట్రాదిని తిరుపతి డీఎస్పీ స్పెషల్ బ్రాంచ్‌కు.. వీఆర్ సీఐ బీ సురేష్‌బాబును పల్నాడు జిల్లా ఎస్‌బీ (స్పెషల్ బ్రాంచ్) 1గా నియమించారు.
డీటీసీ సీఐగా ఉన్న యూ శోభన్‌బాబును పల్నాడుజిల్లా ఎస్‌బీ2 (స్పెషల్ బ్రాంచ్)కు.. పిడుగురాళ్ల ఎస్సై కే అమీర్‌ను కారంపూడి ఎస్సైగా పంపించారు. పల్నాడు జిల్లా స్పెషల్ బ్రాంచ్ ఎస్సై పట్టాభిని నాగార్జున సాగర్ ఎస్సైగా నియమించారు. వీఆర్ ఇన్స్‌పెక్టర్ ఏ విశ్వనాథ్ చౌదరిని తిరుపతి ఎస్బీ ఇన్స్‌పెక్టర్‌గా.. వీఆర్ ఇన్స్‌పెక్టర్ ఎం రామారావును అలిపిరి ఇన్స్‌పెక్టర్‌గా నియమించింది ఈసీ. వీఆర్ ఇన్స్‌పెక్టర్ పీ నాగేంద్రప్రసాద్‌ను తాడిపత్రి ఇన్స్‌పెక్టర్‌గా నియమించారు.