హనుమంతునిపాడు మండలంలోని గొల్లపల్లి, నాగులేరు ఒడ్డున వెలసిన లక్ష్మి చెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాలు సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి. మొదటిరోజు ఆలయ ప్రధాన అర్చకులు వెంకటేశ్వర శర్మ , ఎండోమెంట్ అధికారి జనార్ధన్ రెడ్డిలు ఆధ్వర్యంలో స్వామివారికి అభిషేకాలు నిర్వహించారు. ఆరు రోజుల పాటు జరిగే ఉత్సవాలకు రాష్ట్రంలోని నలుమూలల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు వస్తారని వారు తెలిపారు.