కొరిసపాడు మండలం బోల్లవరప్పాడు నుండి మేదరమెట్ల వెళ్లే రహదారి అధ్వానంగా మారింది. తారు రోడ్డు కుంగిపోయి గులకరాళ్లు బయటపడ్డాయి. దీంతో ఆ రోడ్డున వెళ్లాలంటేనే వాహన చోదకులు హడలిపోతున్నారు. రాత్రి వేళల్లో ప్రయాణం ప్రాణ సంకటంగా మారిందని పలువురు వాహన చోదకులు మంగళవారం లోకల్ యాప్ వద్ద వాపోయారు. వచ్చే ప్రభుత్వంలోనైనా ప్రజాప్రతినిధులు చొరవచూపి కొత్త రోడ్డు వేయాలని వారు కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa