వాడరేవు- రామాపురం రోడ్డులో మంగళవారం ఉదయం ద్విచక్ర వాహనం అదుపుతప్పి ఊటుకూరి సుబ్బయ్య పాలెంకు చెందిన మత్స్యకారుడు బాలాజీ (55) దుర్మరణం చెందాడు. ఉదయాన్నే పని మీద బయలుదేరి ద్విచక్ర వాహనంపై వేగంగా వెళుతుండగా అది అదుపుతప్పి కింద పడడంతో తల పగిలి బాలాజీ అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న ఈపూరుపాలెం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టానికి చీరాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.