చీరాల నియోజకవర్గం మీద ఎస్పీ జిందాల్ డేగ కన్ను వేశారు. పోలింగ్ రోజున టిడిపి, కాంగ్రెస్ అభ్యర్థులపై ప్రత్యర్థులు దాడికి ప్రయత్నించడం, పరాయి ప్రాంత కిరాయి రౌడీలు చీరాలలో బస చేయడం, ఇంత జరుగుతున్నా డిఎస్పి బేతపూడి ప్రసాద్ తో సహా పోలీసు యంత్రాంగం ప్రేక్షక పాత్ర వహించడంపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు అందడంతో ఎస్పీ స్వయంగా రంగంలోకి దిగారు. కౌంటింగ్ రోజు ఎటువంటి ఘర్షణలు తలెత్తకుండా ఆయన చర్యలు తీసుకుంటున్నారు.