మదనపల్లెలో సోమవారం సాయంత్రం ఓ మహిళ ఆత్మహత్యకు ప్రయత్నించింది. తాలూకా పోలీసుల వివరాల మేరకు. బసినికొండకు చెందిన నౌషాద్ తన భార్య షమీంను కుటుంబ సమస్యల విషయమై మందలించాడు. దీంతో ఆమె అవమానంగా భావించి మనస్తాపంతో ఇంట్లో ఉన్న పురుగు మందు తాగింది. కుటుంబీకులు గమనించి ఆమెను చికిత్స కోసం జిల్లా ఆస్పత్రికి తరలించారు. డాక్టర్లు పరీక్షించి చికిత్స అందించారు.