స్పెక్యులూస్-3బి అనే కొత్త గ్రహాన్ని బెల్జియంలోని యూనివర్సిటీ ఆఫ్ లీజ్‌కు చెందిన ఖగోళ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఈ గ్రహం భూమికి 55 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న అతి చల్లగా ఉండే ఎర్రని మరుగుజ్జు నక్షత్రం కక్ష్యలో చుట్టూ తిరుగుతోందని గుర్తించారు. ఈ ఎర్రని మరుగుజ్జు నక్షత్రం పరిమాణంలో బృహస్పతిని పోలి ఉన్న సూర్యుడి కంటే 100 రెట్లు మసకబారిన కాంతిని విడుదల చేస్తుంది.