స్పెయిన్లోని ప్రముఖ పర్యాటక ద్వీపం మజోర్కాలో రెస్టారెంట్ పైకప్పు కూలి నలుగురు మృతి చెందగా, 20 మందికి పైగా గాయపడ్డారు. ఏడుగురికి తీవ్రగాయాలయ్యాయని Xలో స్పెయిన్ ఎమర్జెన్సీ బృందాలు తెలిపాయి. క్షతగాత్రులను పాల్మాలోని వివిధ ఆస్పత్రులకు తరలించారు. అత్యవసర బృందాలు సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తున్నాయని స్థానిక పోలీసు ప్రతినిధి తెలిపారు.