పాఠశాలలు పునఃప్రారంభంలోపు జిల్లాలోని అన్ని పాఠశాలలకు విద్యాకానుక, పాఠ్యపుస్తకాలను చేర్చాలని ఎస్టీయూ అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు అంకం శివారెడ్డి డిమాండ్ చేశారు. శనివారం ఆయన ఎస్టీయూ నేతలతో కలిసి అన్నమయ్య జిల్లా విద్యాశాఖాధికారి శివప్రకాశరెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.... జూన 12వ తేదీలోపు అన్ని పాఠశాలలకు పాఠ్యపుస్తకాలు, విద్యాకానుకలను చేర్చాలన్నారు. ఎస్‌ఎస్‌సీ స్పాట్‌లో పాల్గొన్న ఇంగ్లీషు, ఫిజిక్స్, బయాలజీ, మ్యాథ్స్ టీచర్లకు పారితోషికం ఇచ్చినా, ఇంకా టీఏ, డీఏలను చెల్లించలేదన్నారు. గత, ప్రస్తుత వేసవి సెలవుల్లో నాడు- నేడు ఫేజ్-2 కింద పాఠశాలల్లో పనులు చేయిస్తున్న ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులకు, సార్వత్రిక ఎన్నికల్లో పాల్గొన్న ఉపాధ్యాయులకు సంపాదిత సెలవులు మంజూరుకు చర్యలు తీసుకోవాలని డీఆర్‌వోకు ఇచ్చిన వినతిపత్రంంలో కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్టీయూ రాష్ట్ర నాయకులు వై. రవీంద్రనాఽథ్‌రెడ్డి, జిల్లా మైనార్టీ కన్వీనర్ ఎస్‌ఏ మున్వర్‌బాషా, జిల్లా నాయకులు వాసుదేవరెడ్డి, శంకర్‌రెడ్డి, ప్రదీప్, నాగరాజు, జగదీశ, గోపీక్రృష్ణ, భాస్కర్‌రెడ్డి, సునీర్, మధుసూదనరెడ్డి, శివశంకర్ తదితరులు పాల్గొన్నారు.