ఫిర్యాదుల్లేని సేవలే లక్ష్యంగా పనిచేయాలని ఎస్‌ఈ రమణ సిబ్బందికి సూచించారు. శనివారం సుండుపల్లె మండలంలోని సానిపాయి 33/11 కేవీ సబ్‌స్టేషన, ట్రాన్సఫార్మర్లు, లైన్లను పరిశీలించారు. సానిపాయి రైతుల విద్యుత సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం సుండుపల్లె మండల క్షేత్రస్థాయి అధికారులు, సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ...... ప్రకృతి వైపరీత్యాల కారణంగా లైన్లు తెగిపడే అవకాశాలు ఉన్నాయన్నారు. వీటి కారణంగా ప్రమాదాలు జరగ కుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. ఒక్క యూనిట్ విద్యుత కూడా వృథా కాకూడదన్నారు. విద్యుత అక్రమ వినియోగం అరికట్టాలన్నారు. వాలిపోయిన స్థంభాలను, లూజు లైన్లను ఎప్పటికప్పుడు సరిచేయాలని ఆదేశించారు. తక్కువ ఎత్తులో ఉన్న లైన్లను గుర్తించి యుద్ధప్రాతిపదికన తగుచర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బకాయిలు వసూలుపై దృష్టి సారించాలని ఆదేశించారు. విద్యుత ప్రమాదాల నివారణ లక్ష్యంగా ప్రజలను చైతన్యవంతులు చేయాలని తెలి పారు. వినియోగదారుల విద్యుత సమస్య లను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ఆదే శించారు. లైన్లలో సమస్యలను నాణ్యమైన విద్యుత సరఫరాకు కృషి చేయాలని అధికారులను ఆదేశించారు. రాయచోటి ఈఈ చంద్రశేఖర్‌రెడ్డి, డీఈఈ చాంద్‌బాషా, అసిస్టెంట్ ఇంజనీర్, రమేశ, సిబ్బంది పాల్గొన్నారు.