కర్నూలు జిల్లా, కొత్తపల్లి మండలంలోని ఆయా గ్రామ సచివాలయాల్లో ఎలాంటి సమాచారం లేకుండా విధులకు గైర్హాజరైన 8 మందికి కొత్తపల్లి ఎంపీడీవో జవహర్‌బాబు మెమోలు జారీ చేశారు. శుక్రవారం ఎంపీడీవో కొత్తపల్లి సచివాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేయగా.. పంచాయతీ కార్యదర్శి టీకేఎస్ చిన్నస్వామి, ఏఎన్ఎం దారా జ్యోతి, వీఏఏ దుర్గాచరణ్, డబ్ల్యూఈఏ మల్లికార్జున గైర్హాజరైనట్లు ఎంపీడీవో గుర్తించారు. అలాగే శివపురం గ్రామ సచివాలయంలో పంచాయతీ సెక్రటరీ అజ్మత్, జేఎల్ఎం ఇబ్రహీం, ఏహెచ్ఏ సారా, అలాగే గుమ్మడాపురం సచివాలయంలో ఏహెచ్ఏ సరితా బాయి గైర్హాజరైనట్లు ఆయన తనిఖీల్లో వెల్లడైంది. అనంతరం ఎంపీడీవో మాట్లాడుతూ ఆయా గ్రామాల సచివాలయ సిబ్బంది ఎటువంటి ముందస్తు అనుమతులు లేకుండా విధులకు గైర్హాజరైనందున వీరికి మెమోలు జారీ చేశామని చెప్పారు. మూడు రోజుల్లో లిఖిత పూర్వకంగా తమ సంజాయిషీని స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో అందజే యాలని, లేనిపక్షంలో క్రమశిక్షణా చర్యల కోసం ఉన్నతాధికారులకు నివేదించనున్నట్లు వెల్లడించారు.