కాకినాడ సమీపంలోని ఉప్పాడలో సముద్రం అల్లకల్లోలంగా మారింది. శనివారం ఉదయం సుబ్బంపేట నుంచి ఎస్పీజీఎల్ వరకు సముద్రపు అలలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. ఈ అలల ఉదృతికి బీచ్ రహదారిపై వెళ్తున్న ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలాగే రహదారిపై వాహనదారులను సైతం ఈ అలలు ముంచెత్తున్నాయి. ఇక సముద్రంలో ఒక్కసారిగా నీటి మట్టం పెరగడం, అలాగే సముద్రం ముందుకు రావడంతో మత్స్యకారులు తీవ్ర భయాందోళన చెందుతున్నారు.