విశాఖపట్నం జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్‌కు త్వరలో లీగల్ నోటీస్ జారీ చేస్తామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే ఎస్ జవహర్ రెడ్డి కార్యాలయం హెచ్చరించింది. విశాఖపట్నం జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డిపై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని సీఎస్ కార్యాలయ అధికారులు పేర్కొన్నారు. శనివారం విశాఖపట్నంలో కార్పొరేటర్ మూర్తి యాదవ్ సీఎస్ జవహర్ రెడ్డిపై చేసిన అసత్యమైన, నిరాధార ఆరోపణలు వాస్తవం కాదని స్పష్టం చేశారు. దీనికి ఇప్పటికే ఖండిస్తూ పత్రికా ముఖంగా స్టేట్మెంట్ ఇచ్చినట్టు తెలిపారు. అయినప్పటికీ కార్పొరేటర్ మూర్తి యాదవ్ మరొకసారి ఆదివారం విశాఖపట్నంలో మీడియా సమావేశం పెట్టి జవహర్ రెడ్డిపై మరొసారి అవే అసత్య, నిరాధారమైన ఆరోపణలను చేశారని చెప్పాది. మూర్తి యాదవ్ చేసిన ఆరోపణలకు సంబంధించి అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు న్యాయ నిపుణులను సంప్రదించినట్లు తెలిపారు. త్వరలో కార్పొరేటర్ మూర్తి యాదవ్‌కు లీగల్ నోటీసు జారీ చేస్తామని సీఎస్ కార్యాలయ అధికారులు పేర్కొన్నారు.
![]() |
![]() |