రాత్రిళ్లు పలు వాహనాల నుంచి డీజిల్ చోరీకి పాల్పడుతున్న ముగ్గురు వ్యక్తులను ఆదివారం పీలేరు అర్బన పోలీసులు అరెస్టు చేశారు. పీలేరు అర్బన సీఐ మోహన రెడ్డి కథనం మేరకు చిత్తూరు జిల్లా శాంతిపురం మండలానికి చెంది న ఎం.సురేశ కుమార్(24), ఎన.నాగరాజు(26), ఎం.కార్తీక్(20) పీలేరు ప్రాంతంలో ఇటీవలి కాలంలో పలు వాహనాల నుంచి డీజిల్‌ను చోరీ చేసేవారు. ఆయా వాహనదారుల ఫిర్యాదు మేర కు విచారణ ప్రారంభించిన పోలీసులు ఆదివారం స్థానిక సదుం రోడ్డులోని జేవీ నగర్ వద్ద అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి చోరీకి ఉపయోగించే ఒక ఇనుప కమ్మీ, ఒక రబ్బరు పైపు, 200 లీటర్ల సామర్థ్యం కలిగిన ఆరు క్యాన్లు, ఒక టాటా యోధ వాహ నం(ఏపీ39 యూబీ 2558), రూ.18,500లు నగదు స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. అరెస్టు చేసిన వారిని రిమాండు నిమిత్తం పీలేరు సబ్-జైలుకు తరలించినట్లు ఆయన వెల్లడించా రు. కేసు దర్యాప్తును వేగంగా పూర్తి చేసిన పీలేరు ఎస్‌ఐ నరసింహుడు, ఆయన సిబ్బందిని సీఐ అభినందించారు.
![]() |
![]() |