కార్మికుల, ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి జూన 4 తరువాత ఏర్పడే కొత్త ప్రభుత్వం చొర వ చూపాలని ఏఐటీయూసీ కడప జిల్లా ప్రధాన కార్యదర్శి సాంబశివ కోరారు. ఆదివారం స్థానిక ఎస్టీయూ టీవీరెడ్డి భవనలో మదనపల్లె నియోజకవర్గ, పట్టణ స్థాయి సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా సాంబశివ మాట్లాడుతూ కార్మికవర్గ సమస్యలు పరిష్కరించడంలో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రభుత్వాలు వైఫల్యం చెందాయన్నారు. అనునిత్యం దేశంలో సంపదను సృష్టించే కార్మిక వర్గానికి కనీసవేతనాలు అమలు చేయకుండా శ్రమదోపిడీకి ప్రభుత్వాలు పాల్పడుతున్నాయని ఆరోపించారు. చిరు ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి కనీస వేతనం తోపాటు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని కోరారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు రెడ్డెప్ప, ముబారక్, తిరుమల, రవి, మురళి, తదితరలు పాల్గొన్నారు.