రైల్వే ట్రాక్,ఇతర నిర్వహణ పనులు కారణంగా జిల్లాలో పది రోజులుగా రద్దయిన డెమో రైళ్లు సోమవారం నుంచి పట్టాలెక్కనున్నాయి. గుంటూరు, విజయవాడ, రాజమండ్రి, నిడదవోలు నుంచి నడిచే అన్ని రైళ్లు గతంలో మాదిరిగా షెడ్యూల్ ప్రకారం నడవనున్నాయి.అలాగే భీమవరం, నరసాపురం నుంచి నడిచే డెమో రైళ్లు కూడా గతంలో నడిచిన విధంగానే షెడ్యూల్ సమయాలకు బయలు దేరనున్నాయి. అయితే ఉదయం గుంటూరు వెళ్లే పాస్ట్ ప్యాసింజర్‌కు మాత్రం ఇంకా పచ్చజెండా ఊపలేదు. ఈ ఎక్స్‌ప్రెస్ ఈ నెల 31 నుంచి బయలు దేరనున్నట్లు తెలియవచ్చింది. ఇటు నరసాపురం నుంచి ఉదయం 9.45 వెళ్లే విజయవాడ, మధ్యాహ్నం 2.45కి వెళ్లే గుంటూరు, 3.05కి వెళ్లే విజయవాడ, రాత్రి 8.10కి వెళ్లే నిడదవోలు, రాత్రి 11.10కి వెళ్లే భీమ వరం డెమా రైళ్లు గతంలో మాదిరిగా యఽధా విధిగా నడవనున్నాయి. పది రోజులుగా డెమో రైళ్లు రద్దు కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రైళ్లన్నింటిని ఒకేసారి రద్దు చేయడంతో ఎప్పుడు ప్రయాణికులతో కళకళలాడుతూ కనిపించే భీమ వరం, నరసాపురం, తణుకు, పాలకొల్లు వంటి స్టేషన్లు వెలవెలబోయాయి. అయితే జిల్లా వాసులు గుంటూరు పాస్ట్ ప్యాసింజర్ రైలు కోసమే ఎదురు చూస్తున్నారు.ఈ రైలు రద్దు చేయడం వల్ల ఉదయం వేళ్లల్లో గుంటూరు, విజయవాడ వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.