టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు దివంగత నందమూరి తారక రామారావు 101వ జయంతి సందర్భంగా మంగళవారం ఆదోని టీడీపీ కార్యాలయంలో ఆదోని ఇన్చార్జ్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు మీనాక్షీనాయుడు, ఎన్డీఏ కూటమి అభ్యర్థి డాక్టర్ పార్థసారథి, జిల్లా నాయకులు భూపాల్ చౌదరి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన పెన్షన్ పథకం నేడు లక్షల మంది జీవితాల్లో వెలుగులు నింపుతోందని కొనియాడారు.