ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సమయంలో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ఏర్పడిన తరువాత ఎన్నికల కమిషన్ వ్యవహార శైలి మారిందని వైయస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో జరుగుతున్న సంఘటనలను బట్టి మేం మాట్లాడాల్సి వచ్చిందని చెప్పారు. ఎన్నికల సమయంలో టీడీపీ నేతల అరాచక వీడియోలు ఎందుకు బయటకు రావడం లేదని ఆయన ప్రశ్నించారు. ఈసీ కక్షసాధింపు ధోరణిలో వెళ్లాల్సిన అవసరం ఏముందని నిలదీశారు. పిన్నెళ్లి రామకృష్ణారెడ్డికి హైకోర్టులో ఊరట లభించడం, ఎన్నికల కౌంటింగ్, ఈసీ వ్యవహార శైలీ, టీడీపీ, ఎల్లోమీడియా టెర్రిరిజంపై సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు.