ఇంటర్మీడియట్ పబ్లిక్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలను సజావుగా నిర్వహించాలని అనంతపురం జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్. వి ఆదేశించారు. మంగళవారం అనంతపురం నగరంలోని ఆలమూరు రోడ్ లో ఉన్న ఎస్ఆర్ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ పబ్లిక్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలను జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు. ఆయన మాట్లాడుతూ జిల్లాలో 34 కళాశాలల్లో థియరీ ఎగ్జామినేషన్ సెంటర్లను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.