ధర్మవరం పట్టణం శాంతినగర్‌లోని బీజేపీ కార్యాలయంలో స్వాతంత్ర్య సమరయోధుడు వీర్ సావర్కర్ 141వ జయంతిని మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. కార్య క్రమంలో విశ్వహిందూ పరిషత్ జిల్లా అధ్యక్షుడు పులిచర్ల వేణుగోపాల్, హిందీ పండితుడు వేణు గోపాల్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.