శ్రీసత్య సాయి జిల్లా పరిగి మండలం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మంగళవారం మండల పరిధిలోని అన్ని హెల్త్ అండ్ వెల్నెస్ కేంద్రాలలో ఋతుక్రమం ఆరోగ్యం, పరిశుభ్రత దినోత్సవం ను పురస్కరించుకొని అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. పరిగి లోని అమర్ విద్యాలయం, కొడిగెనళ్ళి ఆరోగ్య ఉపకేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వైద్యాధికారి డా. నవీన, బృందం అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సిబ్బంది పాల్గొన్నారు.