రోడ్డు ప్రమాదం, అనారోగ్యం కారణాలతో వేర్వేరుగా మృతి చెందిన ఇద్దరు హోంగార్డుల కుటుంబాలకు మంగళవారం అనంతపురం జిల్లా ఎస్పీ గౌతమిశాలి ఆర్థిక సాయాన్ని అందించారు. అనంతపురం పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో రూ. 8, 77, 200 విలువ చేసే రెండు చెక్కులను అందించారు. ఎస్పీ మాట్లాడుతూ జిల్లా హోంగార్డులు తమ గౌరవ వేతనంలో ఒక రోజు వేతనాన్ని ఇలా సహచర కుటుంబాలకు అందజేయడం అభినందనీయమని అన్నారు.