ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని కోర్ట్ సెంటర్ లో ఈనెల 25వ తేదీ రాత్రి లాయర్ రసూల్ పై దాడి చేసిన నిందితుని అరెస్టు చేసినట్లు పట్టణ ఎస్ఐ అబ్దుల్ రెహమాన్ మంగళవారం తెలియజేశారు. తన పొలం కేసు విషయంలో లాయర్ అడ్డు తగులుతున్నారని నిందితుడు నిషార్ అహ్మద్ కక్ష పెంచుకొని గొడ్డలితో లాయర్ రసూల్ పై దాడికి పాల్పడ్డారు. గాయపడిన రసూల్ ఫిర్యాదు మేరకు నిందితుడిని విచారించి అరెస్టు చేసినట్లు ఎస్సై తెలిపారు.