ప్రకాశం జిల్లా మార్కాపురం ఎంపిజే కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ గంజాయి మాఫియాకు అడ్డాగా మారిందని ఎంపిజే రాష్ట్ర అధ్యక్షులు అబ్దుల్ రజాక్ మంగళవారం తెలియజేశారు. దేశవ్యాప్తంగా గంజాయి రవాణాలో ఆంధ్రకు మొదటి స్థానంలో ఉందన్నారు. దేశంలో నాలుగేళ్లలో 23 లక్షల కిలోల గంజాయి పట్టివేత అందులో 70 శాతం ఆంధ్ర ప్రదేశ్ నుండే సప్లై అయిందన్నారు. విద్యార్థులు యువతే లక్ష్యంగా గంజాయి అమ్మకాలు జరుగుతున్నాయని విమర్శించారు.