ప్రకాశం జిల్లా మార్కాపురంలోని పూల సుబ్బయ్య కాలనీ వెనకవైపు మదీనా మసీదు వద్ద మంగళవారం సీఐ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసులు ఇంటింటికి తిరిగి సరైన పత్రాలు లేని సుమారు 13 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. కౌంటింగ్ ప్రక్రియ దగ్గర ఉన్న నేపథ్యంలో అనుమానిత వ్యక్తుల కదలికపై సిఐ ఆరా తీశారు. అలాంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నా పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు.