బ్రహ్మంగారిమఠం మండలంలోని లింగాలదిన్నె పల్లె గ్రామంలో నీటి ఎద్దడితో బోర్లలో నీరు అడుగంటిపోయి వివిధ రకాల పండ్ల తోటలు ఎండిపోతుందని పంటలను సాగు చేస్తున్న రైతు మంగళవారం తమ ఆవేదన వ్యక్తం చేశారు. లక్షలాది రూపాయలు వెచ్చించి సుమారు 7 సంవత్సరాల నుంచి సాగు చేస్తున్నానని మూడు బోర్లలో నీరు ఇంకిపోయి నీరు రాకపోవడంతో చెట్లు ఎండిపోతున్నాయని రైతులు లబోదిబో అంటున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa