రాజంపేట వైసీపీ అసెంబ్లీ అభ్యర్థి ఆకేపాటి అమర్నాథరెడ్డిని నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు మిరియాల సురేఖ ఆకేపాడు ఎస్టేట్ లో మంగళవారం కలిశారు. ఎన్నికల్లో మహిళా ఓటర్లు అధికంగా పాల్గొనడం శుభ పరిణామమని, మహిళల కోసం ఎంతో మేలు చేసిన జగన్ ను గెలిపించేందుకు మహిళలు తరలివచ్చి ఓట్లు వేసి రుణం తీర్చుకున్నారని అన్నారు. రామేశ్వరం యాత్ర చేసి ఆకేపాటికి మంత్రి పదవి రావాలని దేవున్ని ప్రార్థించినట్లు ఆమె తెలిపారు.