మార్టూరు బలరాం కాలనీకి చెందిన బాపట్ల శ్రీదేవి అనే వివాహిత ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆమె భర్త, అత్త, ఇతర బంధువులు ఇద్దరి పై వరకట్న వేధింపులు, గృహహింస కేసులు నమోదు చేసినట్లు మార్టూరు సీఐ రాజశేఖరరెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. 20 ఏళ్ల క్రితం పెళ్లయి ఇద్దరు పిల్లలు ఉన్న తనను ఇప్పుడు వారంతా రెండు లక్షల రూపాయల అదనపు కట్నం తెమ్మని వేధిస్తూ, కొడుతూ చిత్రహింసలు పెడుతున్నారని ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది.