బాపట్ల జిల్లా , చీరాల - వేటపాలెం జాతీయ రహదారి మీద బుధవారం రోడ్డు ప్రమాదం జరిగింది. టమాటా లోడుతో చినగంజాం నుండి చీరాల వైపు వెళుతున్న మినీ లారీ పందిళ్ళపల్లి సమీపంలోకి రాగానే అధిక వేగంతో అదుపు తప్పి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో లారీ రోడ్డు పక్కకు దూసుకుపోయింది. దీంతో లారీలోని టమోటాలు పూర్తిగా నేలపాలయ్యాయి. లారీ డ్రెవర్ కు కొద్ది పాటి గాయాలయ్యాయి. కాగా ప్రమాద ఘటన ఫై వేటపాలెం పోలీసులు విచారణ చేపట్టారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa