ఈవీఎమ్‌లను స్ట్రాంగ్ రూముల వద్ద వరుస సంఖ్యలో ఉంచారు. వీటిని మొదటిగా ఒకటో నెంబరు నుంచి 14వరకు ఉన్న ఈవీఎమ్‌లను అందిస్తారు. రెండో రౌండ్‌లో 15వ నెంబరు నుంచి 28వ నెంబరు ఈవీఎమ్‌వరకు అందిస్తారు. ఇలా ప్రతి రౌండ్‌కు 14 చొప్పున ఈవీఎమ్‌లను అందిస్తూ లెక్కింపును కొనసాగిస్తారు. ప్రతి రౌండ్‌లో ఏ అభ్యర్థికి ఎన్ని ఓట్లు వచ్చినది ప్రకటిస్తారు. అయితే అధికారికంగా ప్రకటించే టప్పటికి జాప్యం జరుగుతూ ఉంటుంది. కౌంటింగ్ జరుగుతున్న ఏజెంట్లకు మాత్రం మూడు లేదా నాలుగో రౌండ్ ఫలితాలు తెలుస్తుంటాయి. అధికారిక ప్రకటన కాస్త ఆలస్యం అవుతుంటుంది. దీనికి తోడు అభ్యర్థుల మెజార్టీలు తక్కువ వ్యత్యాసం ఉంటే ఫలితం మారింత జాప్యం జరుగుతుంటుంది. దీనికి కారణం అభ్యర్థులు రీ కౌంటింగ్ డిమాండ్ చేసే అవకాశం ఉంది. వేల సంఖ్యలో వ్యత్యాసం ఉంటే మాత్రం త్వరగానే లెక్కింపు ఫలితాలు వెలువడే అవకాశం ఉంది.