కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో న్యూరోసర్జరీ ఓపీ రోగులతో కిటకిటలాడింది. బుధవారం ఉదయం నుంచే సూపర్ స్పెషాలిటీ బ్లాక్‌లోని ఓపీ నెంబరు 5కి రోగులు బారులు తీరారు. అనంతరం కర్నూలు, ప్రకాశం, కడప, గద్వాల జిల్లాల నుంచి రోగులు 307 మంది, ఓపీ నెంబరు 5 వద్ద బారులు తీరారు. ఉదయం 9 గంటలకు వచ్చిన ఓపీ రోగులు మధ్యాహ్నం 12 గంటలైనా తగ్గిన పరిస్థితి లేదు. ఓపీ ఉన్నప్పుడు వైద్యుల సంఖ్యను పెంచి త్వరగా చికిత్స అందించాలని రోగులు కోరుతున్నారు.