పోస్టల్ బ్యాలెట్ వ్యాలిడిటీ అనుమానాలపై మరోసారి సీఈఓ ముఖేష్ కుమార్ మీనా స్పందించారు. పోస్టల్ బ్యాలెట్ విషయంలో క్లారిఫికేషన్ ఇప్పటికే ఇచ్చామని చెప్పారు. సీఈఓ ఆఫీసు, ఎన్నికల సంఘం వేర్వేరు కాదని స్సష్టం చేశారు. అయితే ఒక పార్టీకి కొన్ని అనుమానాలు ఉన్నాయని.. వాటిపై కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశామని తెలిపారు. అయితే సీఈఓ మాట్లాడుతున్న సమయంలోనే పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు విషయంలోని అనుమానాలకు కేంద్ర ఎన్నికల సంఘం సమాధానం పంపించింది. సీఈఓ ఇచ్చిన మెమోను ఈసీ సమర్ధించింది. కేవలం గెజిటెడ్ అధికారి సిగ్నేచర్ ఉంటే చాలని స్పష్టం చేసింది. పోస్టల్ బ్యాలెట్‌పై సిగ్నేచర్ మాత్రమే ఉండి సీలు, హోదాలు లేకపోయినా ఆ బ్యాలెట్‌ను కౌంటింగ్ సెంటర్ రిటర్నింగ్ అధికారి వ్యాలిడేట్ చేయొచ్చని సీఈఓ ఎంకే మీనా తెలిపారు.