ఏపీ సీఎస్ జవహర్ రెడ్డిపై వరుసగా జనసేన నేత మూర్తి యాదవ్ సంచలన ఆరోపణలు చేస్తున్నారు. ఆయన చేస్తున్న ఆరోపణలపై సీఎస్ కార్యాలయం నోటీసులు కూడా పంపించింది. అయితే జనసేన నేత మూర్తి యాదవ్ ఏమాత్రం తగ్గకుండా సీఎస్‌పై మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. గురువారం విశాఖలోని జనసేన కార్యాయలంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘నేను ఇదివరకు చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉన్నాను. తర్లువాడలో భూములను జవహర్ రెడ్డి తన బినామీ పేరుతో కొట్టేశారు. మంత్రి మేరుగు నాగార్జున సీఎస్‌తో డ్యూయల్ అగ్రిమెంట్ చేసుకున్నారు. ఈసీ కాపీ రాకుండా రెవిన్యూ వెబ్‌సైట్ బ్లాక్ చేశారు. తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్‌గా ఉన్నప్పుడు జవహర్ రెడ్డి వ్యవహారాలను చోడురాజు, సత్య కృష్ణంరాజు చూసే వారు. జవహర్‌కి మరో బినామీ విశాఖలో పెరిచర్ల శ్రీనివాసరాజు. ఆయన ఎర్ర మట్టి దిబ్బలు దగ్గర వంద ఎకరాలు రాయించుకున్నారు. జవహర్ రెడ్డి బినామీలు సత్య కృష్ణంరాజు, శ్రీనివాసరాజులు విశాఖలో పలచోట్ల లే అవుట్ వేసి అమ్ముతున్నారు. వీటితో జవహర్ రెడ్డికి సంబంధం ఉందో లేదో చెప్పాలి’’ అని మూర్తి యాదవ్ సవాల్ విసిరారు.