వైజాగ్లో ఓ నటుడు భార్యకు విడాకులు ఇవ్వకుండా వేరొక మహిళతో సంబంధం పెట్టుకున్నాడు. ఆపై పెళ్లి కూడా చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న భార్య తన భర్త తనకు కావాలంటూ ఆందోళనకు దిగింది. ఆమె మరెవరో కాదు.. మిస్ వైజాగ్ నక్షత్ర. విడాకులు ఇవ్వకుండానే తనను వదిలేసి వేరొక మహిళతో భర్త కాపురం చేస్తుండటంపై నక్షత్ర నిరసనకు దిగింది. తన భర్త తనకి కావాలంటూ ఆందోళన చేస్తోంది. నక్షత్ర నిరసనకు దిగడంతో ఆమె భర్త తేజ షాక్ అయ్యాడు. 2013లో ఓ సినిమా షూటింగ్లో నక్షత్ర, తేజలకు పరిచయం ఏర్పడింది. ఇద్దరూ 2017లో వివాహం చేసుకున్నారు. ఏమైందో ఏమో కానీ తేజ.. భార్యకు విడాకులు ఇవ్వకుండానే వేరొక మహిళను పెళ్లి చేసుకున్నాడు. దీంతో తనకు న్యాయం చేయాలని నక్షత్ర కోరుతోంది.