ధర్మవరం నియోజకవర్గ ఓట్ల లెక్కింపునకు పకడ్బందీగా ఏర్పాట్లు చేశామని ఆర్డీవో వెంకటరామిరెడ్డి ఆదివారం పేర్కొన్నారు. లెక్కింపులో పాల్గొనే ఉద్యోగులకు లెక్కింపుపై ఇప్పటికే శిక్షణ తరగతులు నిర్వహించామన్నారు. మొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు, తదుపరి ఈవీఎంల ఓట్ల లెక్కింపు చేపడతామన్నారు. ఓట్ల లెక్కింపునకు టేబుళ్లను ఏర్పాటు చేస్తున్నామని, లెక్కింపు కేంద్రం వద్ద పటిష్ఠమైన పోలీసు బందోబస్తు ఉంటుందని పేర్కొన్నారు.