సమస్యాత్మక ఫలితాల వెల్లడి తర్వాత ఎక్కడ అల్లర్లు, గొడవలు జరగకుండా పోలీస్ పీకెట్ 24 గంటల పాటు నిర్వహించాలని జిల్లా ఎస్పీ మణికంఠ ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన చిత్తూరులో ఆదివారం మాట్లాడారు, జిల్లాలోని సమస్యాత్మక ప్రాంతాల్లో బందోబస్తు పెంచాలన్నారు. శాంతిభద్రతల రక్షణకు ముందస్తు చర్యలో భాగంగా రబ్బర్ బుల్లెట్లు, టియర్ గ్యాస్ ఇతర పరికరాలను అందుబాటులో ఉంచుకోవాలన్నారు.