ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీమ, నెల్లూరు జిల్లాల్లో నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి. రానున్న మూడు రోజుల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో రుతుపవనాలు విస్తరించనున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అనుకున్న సమయం కన్నా మూడు రోజులు ముందే రుతుపవనాలు ఏపీలోకి ప్రవేశించాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో అక్కడక్కడ చెదురు ముదురుగా ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. పొడి వాతావరణం ఉన్నచోట మాత్రం కొంత ఉక్కపోత ఉండే అవకాశం ఉందన్నారు. ఈ ఏడాది మొదటి మంచి వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారిని సునంద పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa