టీడీపీ నేత గంటా శ్రీనివాసరావు మరో రికార్డుకు ఒక్క అడుగుదూరంలో ఉన్నారు. నియోజకవర్గాలు మార్చడం. విజయం సాధించడంలో గంటాకు మరొకరు సాటిలేరు. ఇంతవరకు నియోజకవర్గాలు మార్చిమార్చి మళ్లీ పోటీ చేసిన నియోజకర్గం భీమిలీయే కావాలని పట్టుబట్టి మరీ టికెట్ సాధించారు. ఎన్నికల మేనేజ్మెంట్ పక్కాగా తెలిసిన గంటా ప్రత్యర్థి ఎవరైనా సరే విజయమే ఆయనకు తెలిసిన విద్యలా దూసుకుపోతున్నారు. భీమిలి నుంచి తన శిష్యుడు వైసీపీ నేత ముత్తంశెట్టి శ్రీనివాసరావుపై సుమారు 20వేల మెజార్టీతో దూసుకుపోతున్నారు. ఇంకా మూడు రౌండ్లు పూర్తయ్యే సరికి ఈ మెజార్టీ సాధించారు. ఇంకా చాలా రౌండ్లు ఉండడంతో మెజార్టీ ఇంకా పెరిగే అవకాశం ఉంది.